ఇన్సైడ్ టాక్ : “NTR30” కి ఆ టైటిల్..అంతా ట్రాష్.. 

పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి అంచనాలు సెట్ చేసుకొని ఉన్న చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న నెక్స్ట్ సినిమా కూడా ఒకటి. దర్శకుడు కొరటాల శివ తో ఎన్టీఆర్ చేస్తున్న రెండో సినిమా అలాగే ఎన్టీఆర్ కెరీర్ లొ 30వ సినిమా ఇది కావడంతో భారీ అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? హీరోయిన్ ఎవరు? టైటిల్ ఏంటి? అసలు ఉందా లేదా అనే ప్రశ్నలు ఇప్పటికీ ఆసక్తిగానే మిగిలాయి. మరి ఇప్పుడు అయితే సినిమా టైటిల్ కి సంబంధించి కొన్ని గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ ఒక్కటి అడక్కు అంటూ వస్తున్న రూమర్స్ లో ఇంకా ఎలాంటి నిజం లేదట.

ఇంకా సినిమాకి టైటిల్ ఏది అనేది ఫిక్స్ చెయ్యలేదని ఇప్పుడు అయితే సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. దీనితో అయితే ఈ సినిమాపై వినిపిస్తున్న ఈ చెత్త రూమర్స్ అంతా ట్రాష్ అని చెప్పాలి. ఇప్పటికీ అయితే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా మేకర్స్ ఫిక్స్ చెయ్యలేదు అలాగే హీరోయిన్ గా కూడా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. కానీ మ్యూజికల్ వర్క్స్ మాత్రం బాగా జరుగుతున్నాయి. ఇది తప్ప సినిమాపై అయితే ప్రస్తుతం ఎలాంటి ప్రోగ్రెస్ లేదు.