వైసీపీ ఎంపీలంతా ఇప్పుడేం చేస్తున్నారు. గెలుపుకు ముందు వరకూ ప్రత్యేక హోదాపై పోరాంట చేస్తాం. రాష్ర్టాన్ని ఉద్దరిస్తామని చెప్పిన ఎంపీలంతా ఇప్పుడెక్కడున్నారు? అసలు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారా? అంటే లేదనే తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ రెడ్డి ఎంపీలకు అందుబాటులో ఉండటం లేదని ఇప్పటికే విమర్శలున్నాయి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు లా బయటపడకపోయినప్పటికీ కొంత మందిలో ఆ రకమైన అసంతృప్తి అయితే ఉందనే కథనాలైతే వెలువడ్డాయి. మొత్తం వైసీపీ నుంచి 22 మంది ఎంపీలున్నారు. శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ తప్ప మిగిలిన అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ అభ్యర్ధలుగా ఉన్నారు.
మాగంటి శ్రీనివాసులు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజా ప్రతినిధుల పనులు మానేసి సొంత వ్యాపారాల్లో బిజీ అయినట్లు టాక్. ఇక రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతున్నారు. సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఆయనా హడావుడిలో ఉన్నారు. కడప ఎంపీ పార్టీ కార్యక్రమాల్లో బీజీ అవుతన్నారు తప్ప సమస్యలపై కాదన్నది తాజా సన్నివేశాలే చెబుతున్నాయి. అరకు ఎంపీ గొట్టేటి మాధవి కొత్త కాపురంలో బిజీ అయ్యారుట. అరకు దాటి రావడం లేదని అంటున్నారు. ఏలూరు ఎంపీ కొటగిరి శ్రీధర్ విదేశాల టూర్ ముగించుకుని ఇటీవలే స్వదేశానికి వచ్చారు.
అలాగే నరసారావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్థానికంగా పట్టుకోసం బిజీ అయ్యారుట. పోలీస్ ఎంపీ గోరంట్ల మాధవ్ సీరియస్ వ్యాఖ్యలు తప్ప ఇప్పటివరకూ చేసిందేంటని అంటున్నారు. మచిలీపట్నం ఎంపీ బాల శౌరి ఢిల్లీలో కాలం గడుపుతున్నారుట. మిథున్ రెడ్డి సొంత పనుల్లో బిజీ అయినట్లు చెబుతున్నారు. ఇంకా చింతా అనురాధ, వంగా గీత సత్యవతి, రంగయ్య, బిల్లి దుర్గాప్రసాదరావు, సంజీవ్ కుమార్ ఇళ్లకే పరిమితమైనట్లు చెబుతున్నారు. మరి వీళ్లంతా ఇలా మౌనం దాల్చడాన్ని మాట్లాడటానికి టాపిక్ లేదనలో! అదిష్టానం ఆదేశాలు కారణమనాలో ! అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.