ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారికి టీకా ఎప్పుడొస్తుందా? అని ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తొలి దశ క్లినియకల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్నాయి. ఆగస్ట్ 15 కల్లా భారత్ బయోటెక్స్ సిద్దం చేస్తోన్న కోవాగ్జిన్ అందుబాటులోకి వస్తుందని ఐసీఎమ్ఆర్ ప్రకటించినప్పటికీ దానిపై ఇంకా అస్పష్టత ఉంది. ఆ తేదీకి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడంపై డాక్టర్లు సాధ్యపడదని అంటున్నారు. మరి అది సాధ్యమవుతుందా? లేదా? అన్నది పక్కనపెడితే! ప్రపంచ దేశాల ఆశలన్నీ ఆక్స్ పర్డ్ టీకాపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ యూనివర్శీటి నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది.
ఈ ఏడాది అక్టోబర్ కల్లా అందుబాటులోకి వస్తుందని సీరమ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ ఐఐ) సీఈవో అదర్ పూనావాలా ఆశా భావం వ్యక్తం చేసారు. భారత్ లో వచ్చే నెలలో తదుపరి దశ ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో జరిగిన వీడియో కాన్పరెన్స్ సమావేశంలో ఈ విషయాన్ని రివీల్ చేసారు. అక్టోబర్ -నవంబర్ కల్లా టీకా రెడీ అవుతుందని పేర్కొన్నారు. ఆక్స్ పర్డ్ టీకా కొవిషీల్డ్ తొలి దశ ప్రయోగాల్లో మంచి ఫలితాలిచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో కెల్లా అత్యధిక పరిమాణంలో టీకాలను ఉత్పత్తి చేసే సంస్థ ఎస్ ఐఐ. ఆక్స్ ఫర్డ్ యూనివర్శీటీ అభివృద్ధి చేసిన టీకాను ఉత్పత్తి చేసేందుకు గాను బయోఫార్మా సూటికల్ కంపెనీ ఆస్ర్టాజెనికాతో ఈ సంస్థ జత కలిసింది.
ప్రస్తుతం కరోనా బారిన పడిన దేశాలన్ని ఆక్స్ పర్డ్ టీకా కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత్ సైతం అంతే నమ్మకంతో ఉంది. ప్రస్తుతం రెండు, మూడవ దశ ప్రయోగాలు ఆస్ర్టియాలో కొనసాగుతున్నాయి. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని టీకాను తక్కువ ధర నిర్ణయించనున్నారు. ఒక్క భారత్ లోనే వందకోట్ల డోసులను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ఇది భారతదేశ ప్రజలకు పెద్ద శుభవార్తే. పాజిటివ్ కేసులు సంఖ్యలో ప్రపంచంలో భారత్ మూడవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.