బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆలియా.. పదేళ్లుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇంతకాలం బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకున్న ఆలియా ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది.
అంతే కాకుండా ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా కూడా మంచి హిట్ అందుకుంది. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న ఆలియా ప్రస్తుతం గర్భంతో ఉంది. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ఆలియా సినిమా పనులతో బిజీగా గడుపుతోంది. అంతే కాకుండా సింగపూర్‌లో ‘టైమ్ 100 ఇంఫాక్ట్’ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డ్ అందుకోవటానికి ఆలియా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించింది.
ఈ డ్రెస్ లో బేబీ బంప్ తో ఆలియా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఆలియా ధరించిన బ్లాక్ డ్రెస్ ఖరీదు గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆలియా ధరించిన ఈ బ్లాక్ డ్రెస్ ఖరీదు అక్షరాల రూ. రూ.1.80 లక్షలంట. ఈ బ్లాక్ డ్రెస్ లో తన అందంతో ఆకట్టుకున్న ఆలియా తన ప్రసంగంతో అందరిని ఆకర్షించింది. మొత్తానికి బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.