బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా రణబీర్ తన ప్రేయసి ఆలియా భట్ ని వివాహాం చేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ఆలియా భట్ గుర్తింపు పొందింది. కొంతకాలంగా ప్రేక్షకులకి దూరంగా ఉన్న రణబీర్ షంషేరా,బ్రహ్మాస్త్ర లాంటి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. షంషేరా సినిమా జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా యూనిట్ ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో రణబీర్ కపూర్ కూడా సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ ఇటీవల ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో మీకు ఇష్టమైన కోస్టార్ ఎవరు? అని యాంకర్ అడగగా..సౌరభ్ శుక్లా అని సమాధానం చెప్పాడు. వీరిద్దరూ కలిసి బర్ఫీ, జగ్గా జాసూస్ సినిమాలతో పాటు షంషేరా సినిమాలో కూడా కలిసి నటించారు. తర్వాత యాంకర్ అడిగిన ప్రశ్నకు రణబీర్ చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇంటర్వ్యూ లో భాగంగా మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని యాంకర్ అడగగా.. అనుష్క శర్మ అని రణబీర్ సమాధానం చెప్పాడు. వీరిద్దరూ కలిసి ఏ దిల్ హై ముష్కిల్ , బాంబే వెల్వెట్, సంజు వంటి సినిమాలతో నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అనుష్క తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, సెట్ లో కూడా ఇద్దరూ ఎప్పుడూ గొడవపడుతూ ఉంటామని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఇద్దరు క్రియేటివిటి విషయంలో ఒకేలా ఆలోచిస్తామని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం ఆలియాని వివాహాం చేసుకున్న రణవీర్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే వీరిద్దరికీ పేరెంట్స్ గా ప్రమోషన్ రాబోతోంది.