ఏ మాత్రం తగ్గని సమంత క్రేజ్.. మరోసారి ఆ సర్వేలో మొదటి స్థానంలో సమంత?

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా సమంత ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈమె కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. మొదటిసారి సమంత నటించిన ది ఫ్యామిలీ మెన్2 వెబ్ సిరీస్ ద్వారా ఈమె పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ వెబ్ సిరీస్ ద్వారా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈమె తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఇక తాజాగా సమంత నటించిన యశోద సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల 11 రోజులు పూర్తి కావడంతో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను అందుకుంటుంది. ఇకపోతే దేశంలో అత్యంత ఆదరణ పొందిన నటీనటుల జాబితాలను ప్రతినెలా ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అక్టోబర్ నెలలో అత్యంత ఆదరణ పొందిన నటీమణుల జాబితాను విడుదల చేశారు.

ఈ జాబితాలో సమంత మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో అలియా భట్ ఉన్నారు.ఇక మూడవ స్థానంలో నయనతార నాలుగవ స్థానంలో కాజల్ అగర్వాల్ ఐదవ స్థానంలో దీపికా పదుకొనే ఉన్నారు. ఇలా టాప్ పై హీరోయిన్లలో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి సమంత మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఇలా మొదటి స్థానంలో సమంత ఉండడంతో సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదంటూ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.