వైరల్ : తమకి బిడ్డ పుట్టాక ఆలియా ఫస్ట్ ఎమోషనల్ పోస్ట్.!

ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో అలాగే అక్కడి నటీనటులకు అయితే ఓ గుడ్ న్యూస్ దక్కింది. బాలీవుడ్ స్టార్ నటీనటులు అలాగే భార్యాభర్తలు అయినటువంటి రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు గత కొన్ని నెలల కితమే పెళ్లి చేసుకోడం అలాగే జస్ట్ రెండు నెలల్లోనే ఆమె ప్రెగ్నెంట్ గా అనౌన్స్ చెయ్యడం.

అన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ ఇపుడు మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే లేటెస్ట్ గా ఈ స్టార్ జంట తాము ఓ పండంటి ఆడ బిడ్డకి తల్లిదండ్రులు అయినట్టుగా ప్రపంచానికి అనౌన్స్ చేసారు. మరి ఈరోజే ఆలియాకి డెలివరీ కాగా ఈరోజే ఆలియా అయితే ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది.

మరి ఇందులో అయితే ఇది మా జీవితాల్లోని ఒక బెస్ట్ న్యూస్ అని మా మ్యాజికల్ పాప వచ్చేసింది మేము ఇప్పుడు తల్లిదండ్రులుగా మారడం ఎంతో ఉద్వేగభరితంగా ఉందని ఆమె తెలిపి ఈ ఎమోషనల్ నోట్ ని అయితే ఆమె ఇప్పుడు షేర్ చేసింది. దీనితో ఈ పోస్ట్ అయితే వైరల్ గా మారింది.

అలాగే రీసెంట్ గా వీరు నటించిన భారీ చిత్రం బ్రహ్మాస్త్ర కూడా ఓటిటి రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం హాట్ స్టార్ లో పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉంది.