Alekhya Chitti Pickles: సోషల్ మీడియా దెబ్బకు దిగివచ్చిన అలేఖ్య చిట్టి…. క్షమించండి అంటూ!

Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ ప్రస్తుతం వివాదంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సరికొత్త బిజినెస్ లనుప్రారంభించి వాటిని ప్రమోట్ చేస్తూ మంచిగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో అలేఖ్య చిట్టి పీకిల్స్ ఒకరు. వీరు ఇంట్లోనే నాన్ వెజ్ పికిల్స్ తయారు చేస్తూ ఎవరికైతే కావాలో వారికి పంపిస్తూ ఉండేవారు.

అయితే మొదటి నుంచి కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ ధరలు ఎక్కువ అని టాక్ ఉండేది అయితే క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది అంటూ తెలియజేస్తూ వచ్చారు. ఇటీవల ఒక కస్టమర్ మాత్రం మీ పికిల్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయి అంటూ కామెంట్ చేయడంతో ఆ వ్యక్తిపై అలేఖ్య చిట్టి పికిల్స్ దారుణంగా మాట్లాడుతూ అమ్మ బూతులు తిట్టారు దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో దెబ్బకు బిజినెస్ క్లోజ్ చేశారు.

ఇక ఈ ఘటన పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరగడం మీమ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ వివాదం పై ఈ అక్క చెల్లెలు క్లారిటీ ఇస్తూ వచ్చినప్పటికీ వీరి గురించి వచ్చే ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. పికిల్స్ క్వాలిటీ ఉంటే సరిపోదు అలేఖ్య మాటలు కూడా చాలా క్వాలిటీగా ఉండాలి అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అదేవిధంగా జీవితంలో ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలే తప్ప తలపొగరు చూపించకూడదని హితవు పలుకుతున్నారు.

ఇలా తన గురించి ఏమాత్రం ట్రోల్స్ ఆగనీ నేపథ్యంలో అలేఖ్య ఈ వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆలేఖ్య ఒక వీడియోని విడుదల చేస్తూ..నేను తప్పు చేశాను. ఇప్పటి వరకు ఎవర్ని అయితే తిట్టానో.. వారందరికీ క్షమాపణలు చెబుతున్నా అంటూ క్షమాపణలు చెప్పారు. మరి ఈ వీడియో ద్వారా అయినా తనపై వస్తున్నటువంటి ఈ నెగెటివిటీ ఆగి యధావిధిగా తిరిగి వీరు పికల్ బిజినెస్ ప్రారంభిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.