Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య తాజాగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే చాలా రోజుల తర్వాత నాగచైతన్యకు కూడా ఒక మంచి సక్సెస్ వచ్చిందని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ వచ్చారు..
ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన నటి సమంతతో విడాకులు తీసుకొని విడిపోవడం గురించి మాట్లాడారు. సమంతతో విడాకులు తీసుకోవాలి అని తీసుకున్న నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని తెలిపారు. ఒకటికి 1000 సార్లు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. మేమిద్దరం ఎంతో గౌరవంగా ఆ విడాకులను బయట పెట్టామని చైతన్య వెల్లడించారు. కానీ కొంతమందికి మాత్రం అది ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయిందని తెలిపారు.
విడాకుల విషయంలో ఒకటికి 1000 సార్లు ఆలోచించి ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకొని విడిపోయాము ప్రస్తుతం ఎవరిదారి వారు చూసుకుంటూ జీవితంలో ముందుకు వెళుతున్నామని తెలిపారు. బ్రేకప్ బాధ నాకు బాగా తెలుసు. విడాకులు తీసుకోకుండా ఉండాల్సింది కానీ తీసుకున్నాము దానీకంటూ కూడా కారణం ఉందని ఇకపై మా విడాకుల గురించి కాకుండా మీ లైఫ్ పై ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటూ నేటిజెన్స్ కు ఈయన తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు.
ఇకపోతే శోభితతో పెళ్లి గురించి కూడా ఈయన స్పందించారు. శోభిత తనకు ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు. అలా అయిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లిందని తెలిపారు. నా గతంతో శోభితకు ఏమాత్రం సంబంధం లేదు కానీ తనని కూడా నా గతంతో ముడి పెడుతూ విమర్శించారు ఆ సమయంలో చాలా బాధనిపించింది అంటూ నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.