సురేందర్ రెడ్డి అఖిల్‌ను ఏదో చేసేలానే ఉన్నాడు

Akkineni

Akkineni fans start believing Surender Reddy

అక్కినేని అఖిల్.. స్టార్ కిడ్ అయినప్పటికీ సక్సెస్ దొరకని హీరో. అక్కినేని నాగార్జున రెండో వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అఖిల్ ఆరంభం నుండి తబడుతూనే ఉన్నాడు. ఆయన ఏ ప్రయత్నం చేసినా బెడిసికొడుతూనే ఉంది. అఖిల్ నుండి నిన్న మొన్నటి మిస్టర్ మజ్ను వరకు అన్నీ ఫ్లాప్ సినిమాలే. ఒక్కటి కూడ కనీసం యావరేజ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. అలాగని అఖిల్‌కు టాలెంట్ లేదా అంటే బోలెడంత ఉంది. స్మార్ట్ లుక్స్, మంచి డ్యాన్సులు, ఇన్నోసెంట్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి. కానీ హిట్టే లేదు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మీద కూడ గొప్ప నమ్మకాలేవీ లేవు. వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇలా కెరీర్లో మాటి మాటికీ స్లిప్ అవుతున్న అఖిల్ మీద డైరెక్టర్ సురేందర్ రెడ్డి కన్ను పడింది. ‌‌ అఖిల్‌లో పిచ్చ మాస్ యాంగిల్ ఉందని, దాన్ని బయటికి తీసుకొస్తానని అంటున్నారాయన. ప్రజెంట్ అఖిల్‌తో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నారు. ఇందులో అఖిల్ ఏజెంట్ పాత్ర చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ వదిలారు. అందులో అఖిల్ లుక్ చూశాక సురేందర్ రెడ్డి నిజంగానే అఖిల్‌ను కొత్తగా చూపిస్తాడనే నమ్మకం బలపడింది. అక్కినేని అభిమానులైతే సురేందర్ రెడ్డి అఖిల్‌ను ఏదోలా నిలబెట్టేలానే ఉన్నాడని నమ్ముతున్నారు.