అఖిల్ ఎంత పవర్ఫుల్ అనేది తెలిసేది రేపే

Akhil's next movie first look to be unveiled tomorrow
Akhil's next movie first look to be unveiled tomorrow
 
అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటెర్టైనర్. తాను స్టోరీ రాసేటప్పుడు తన మనసులో అఖిల్ మాత్రమే ఉన్నాడని, ఆయనలోని మాస్ యాంగిల్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ బయటపడలేదని, కానీ తన సినిమాతో బయటికొస్తుందని చెబుతో సినిమా గురించి, అందులో అఖిల్ పాత్ర గురించి సురేందర్ రెడ్డి భారీ హైప్ ఇచ్చారు.  దీంతో అక్కినేని అభిమానుల్లో సినిమా పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.  
 
ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు ఉదయం 9:09 గంటలకు రిలీజ్ కానుంది.  ఏ ఈజ్ రెడీ టూ కిల్, ఎస్ ఈజ్ రెడీ టూ స్టన్ అంటూ ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ పోస్టర్ ను ఆసక్తికరంగా విడుదల చేశారు.  ముంబై మోడల్ సాక్షి వైద్యను ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.  ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇకపోతే అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ చిత్రం జూన్ 19న విడుదలకు రెడీ అవుతోంది.