అయ్యగారి హార్డ్ కోర్ ఫ్యాన్ కి అఖిల్ బంపర్ ఛాన్స్.!

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని సక్సెస్ కోసమే హాట్ టాపిక్ నడుస్తోంది. అఖిల్ హీరోగా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” తో అఖిల్ తన ఫస్ట్ కమెర్షియల్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సక్సెస్ మీట్ లో అఖిల్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం జరుగింది.

అఖిల్ అండ్ అక్కినేని కుటుంబంకి ఓ హార్డ్ కోర్ అభిమాని ఉన్నాడు. పేరు ఏమో కాని సోషల్ మీడియాలో మాత్రం “అయ్యగారి అభిమాని” అంటే అందరికీ ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ అభిమానినే ఒకవేళ కుదిరితే తప్పకుండా కలుస్తానని చెప్పాడు.

అంతేకాకుండా తనకన్నా తన అభిమానికే క్రేజ్ సోషల్ మీడియాలో రావడం చాలా ఆనందంగా కూడా ఉంది అని తప్పకుండా అతడిని కలుస్తానని అఖిల్ చెప్పడం అక్కినేని ఫాన్స్ ని మరింత ఖుషి చేసింది. మొత్తానికి సోషల్ మీడియా పుణ్యమాని అయ్యగారి అభిమాని బంపర్ ఛాన్స్ కొట్టేసాడని చెప్పాలి. ఇంతకు మించిన ఆనందం కూడా ఇంకొకటి అతడికి ఉండదని కూడా చెప్పొచ్చు.