మనసులో మాట చెప్పేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’

అక్కినేని అందగాడు అఖిల్ నటిస్తున్న 4 వ చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్’ బ్యాచిలర్’. అఖిల్ ఆశలన్నీఈ సినిమా పైనే. దసరా బరిలో ధియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమవుతోందీ సినిమా. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొటున్నాడు అఖిల్.

ఈ క్రమంలో తన మనసులోని మాటల్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. అఖిల్‌కి మొదట్నుంచీ క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. సెలబ్రిటీ క్రికెట్‌లో అఖిల్ చాలా సార్లు తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు కూడా. అదంతా రియల్. ఇక ఇప్పుడు రీల్ క్రికెట్ విషయానికి వచ్చేద్దాం. క్రీడా నేపథ్యంలో ఓ సినిమాలో నటించాలన్నది తన కోరిక అని అఖిల్ తన కోరికను బయటపెట్టాడు.

క్రీడా నేపథ్యం అంటే ఇంకేంటనుకుంటున్నారా.? క్రికెట్. అంతకన్నా ఇంకేముంటుంది. విరాట్ కోహ్లీ అంటే తనకెంతో ఇష్టమనీ, ఒకవేళ ఆయన బయోపిక్ అంటూ చేసే అవకాశమొస్తే, విరాట్ కోహ్లీ బయోపిక్‌లో తాను నటిస్తాననీ అంటున్నాడు. విరాట్ కోహ్లీ కేవలం ఆటగాడే కాదు, ఆయన పర్సనల్ లైఫ్‌లో చాలా ఎమోషన్స్ ఉన్నాయనీ, వాటిని క్యారీ చేస్తూ, ఓ అద్భుతమైన కథను తయారు చేస్తే బావుంటుందని మన సీనియర్ రైటర్స్‌కి ఓ స్వీట్ రిక్వెస్ట్ కూడా వేసేశాడు అఖిల్.

అబ్బో.. ఈ సిసింద్రీ తక్కువోడేం కాదు. పెద్ద ప్రాజెక్టుకే టెండర్ పెట్టేశాడుగా.