Ajith: పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన అజిత్..?

Ajith: తమిళ స్టార్ హీరో అజిత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తమిళనాడులో సినీ తారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాడులో ఎక్కువకాలం పాలించిన కరుణానిధి, జయలలిత, ఎంజీఆర్ లాంటి సీఎంలు సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. ఇకపోతే తమిళ స్టార్ హీరో అయిన అజిత్ రాజకీయాలలోకి రావాలి అని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే వార్తలు కూడా ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలను ప్రతిసారి ఆయన ఖండిస్తూ వచ్చారు.

తాజాగా ఇదే విషయంపై మరొకసారి స్పందించారు. తనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపారు. ఇదే విషయంపై అతని పర్సనల్ మేనేజర్ సురేష్ చంద్ర మాట్లాడుతూ అది కు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అసలు లేదని తెలిపారు. అదేవిధంగా అటువంటి వార్తలను మీడియా వారు ప్రోత్సహించ వద్దు కోరుతున్నామని తెలిపారు.