‘వాలిమై’.. అనుకున్నంత చేసిన అజిత్ అభిమానులు

Ajith fans create record for Valimai motion poster
Ajith fans create record for Valimai motion poster
 
అజిత్ అభిమానులకు రికార్డుల పట్టింపు బాగా ఎక్కువ.  తమ హీరో సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే విపరీతంగా ట్రెండ్ చేస్తుంటారు.  అందరి హీరోలను మించి ఉండేలా లెక్కలు సృష్టిస్తారు.  ఫ్యాన్స్ దాదాపు రెండేళ్లుగా అజిత్ కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వాలిమై చిత్రం మొదలైనప్పటి నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ బయటికి వస్తాయా అని ఎదురుచూశారు. ఆలస్యం కావడంతో దర్శక నిర్మాతల మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.  సినిమా అప్డేట్ డిమాండ్ మీదనే సోషల్ మీడియాలో పలుమార్లు ట్రెండ్ చేశారు.  అలాంటి వారు రావాల్సిన అప్డేట్ వస్తే ఊరుకుంటారా.. చెలరేగిపోరూ.  
 
వాలిమై మోషన్ పోస్టర్ నిన్న రిలీజ్ అయింది.  విడుదలకు కొన్ని గంటల ముందే ట్రెండ్ స్టార్ట్ చేసిన ఫ్యాన్స్ విడుదలయ్యాక ఇంకా రేగిపోయారు. ట్విట్టర్లో ఏకంగా వాలిమై హ్యాష్ ట్యాగ్ మీద 2 మిలియన్లకి మించి ట్వీట్స్ చేసి ఆశ్చర్యం కలిగించారు. ఇక యుట్యూబ్లో అయితే అతి తక్కువ సమయంలో ఎక్కువగా లైక్ చేయబడిన మోషన్ పోస్టర్ అనే ఘనతను సాధించి పెట్టారు సినిమాకు. ఈ తతంగం మొత్తం 24 గంటలు కూడ గడవకముందే చేశారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో వాలిమై హడావుడే నడుస్తోంది.  హెచ్. వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇంకాస్త మాత్రమే బాలన్స్ ఉంది.  దాన్ని ముగించి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు టీమ్.