తమిళ హీరో అజిత్‌కు అభిమానులతోఎంతో సౌమ్యంగా ఉంటారనే పేరుంది. ఇప్పటివరకు ఆయన బహిరంగ ప్రదేశాల్లో కోపగించుకున్న సందర్భాలు లేవు. షూటింగ్ స్పాట్ అయినా వేరే ఎక్కడైనా ఫ్యాన్స్ తనను కలవడానికి వస్తే నవ్వుతూ ఫోటో ఇచ్చే అజిత్‌నే ఇన్నాళ్లు మనం చూశాం. కానీ ఆయనకు కూడ కోపం ఉంది. ఎవరైనా హద్దులు దాటితే అది బయటపడుతుంది. అదే ఈరోజు జరిగింది. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నందున అజిత్ తిరువాన్మియూర్ బూత్ లో ఓటు వేశారు.
అయితే ఎప్పటిలాగే ఆయన్ను చూసిన జనం ఆయన చుట్టూ గుమిగూడారు. ఫోటోలు తీసుకునే ప్రయత్నం చేశారు. వారిలో ఒకరు అజిత్ పక్కకు చేరి ఫోటో తీసుకునేందుకు ట్రై చేశాడు. మొదట్లో అతడ్ని అజిత్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతగాడు మాస్క్ వేసుకోలేదని గ్రహించిన అజిత్‌కు చిర్రెత్తుకొచ్చింది. అసలే కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఇలా మాస్క్ లేకుండా ఉండటంతో వెంటనే అతడిసి చేతిలో ఫోన్ లాగేసుకున్నారు. అక్కడి నుండి వెళ్ళమని వార్నింగ్ ఇచ్చారు. కాసేపటికే చల్లబడిన అజిత్ ఫోన్ స్వయంగా తిరిగిచ్చేసి అతడికి సారీ కూడ చెప్పాడు. అజిత్ కోపాన్ని చూసి విస్మయానికి గురైన అక్కడి జనం తర్వాత ఆయన కోపంలో అర్థం ఉందని గ్రహించారు.