Kamal Haasan: అభిమానులు చేసిన పనికి స్టేజ్ పైన సీరియస్ అయిన కమల్ హాసన్.. నెట్టింట వీడియో వైరల్!

Kamal Haasan: విలక్షణ నటుడు హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు కమల్ హాసన్. ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ మధ్యకాలంలో కమల్ హాసన్ వరుస కాంట్రవర్సీలతో సోషల్ మీడియాలో ఎక్కువగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మరో విషయంలో వార్తల్లో నిలిచారు కమల్ హాసన్. స్టేజ్ మీద అయినా అభిమానుల పై మండిపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే..చెన్నైలో మక్కల్‌ నీది మయ్యం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ చీఫ్, నటుడు కమల్ హాసన్ విచ్చేశారు. తమిళనాడు నుంచి రాజ్యసభకు కమల్‌ హాసన్ ఏకగ్రీవంగా ఎన్నికైన కొద్ది రోజుల తర్వాత చెన్నైలో ఈ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. బహిరంగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం జరుగతున్న సమయంలో వేదికపైగా కొందరు కార్యకర్తలు చేరుకుని ఆయనకు ఒక భారీ కత్తిని బహూకరించారు. అయితే మొదట నవ్వుతూనే కత్తిని కమల్‌ స్వీకరించారు. అనంతరం వారు కత్తిని చేతితో పట్టుకోవాలని ఒత్తిడి చేశారు.

అప్పుడు తల అడ్డంగా ఊపుతూ సున్నితంగా తిరస్కరించడానికి ప్రయత్నించిన కమల్.. మరో కార్యకర్త కత్తిని ఒరలో నుంచి తీసి కమల్‌ చేతికి బలవంతంగా అందించబోయాడు. దీంతో సహనం కోల్పోయిన కమల్‌ కత్తిని కిందపెట్టాలంటూ హెచ్చరించారు. ఆ తర్వాత కూడా కమల్‌ హాసన్‌ తో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు వారు ఆసక్తి చూపగా ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు కార్యకర్తను నిలువరించి, వేదికపై నుంచి కిందకి దింపేశారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ కార్యకర్తల వైపు కోపంగా చూస్తూ కళ్ళు ఎర్ర చేశారు. అలా కొద్ది నిమిషాల పాటు వేదికపై గందరగోళం నెలకొంది. ఆ తర్వాత పోలీసులు వేదిక పైకి రావడంతో మళ్లీ యధాస్థితికి చేరుకుంది. కోప్పడిన వారికి కరచాలనం చేస్తూ నవ్వుతూ కార్యక్రమం కొనసాగించాలని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.