చత్తీస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. రాయ్ పూర్ లోని శ్రీనారాయణ అసుపత్రిలో వెంటిలేటర్ పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. మే 9న అజిత్ జోగి ఆసుపత్రిలో చేరారు. తర్వాత కొన్ని రోజులకే కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయనలో ఎలాంటి చలనం లేదు. నాడీ వ్యవస్థ దాదాపుగా అచేతనంగా మారిపోయిందని వైద్యులు తెలిపారు. డాక్టర్లు ఎంత శ్రమిస్తున్నా ఆయనలో ఎలాంటి కదలికలు లేవని చెబుతున్నారు.
ప్రస్తుతం రేడియో థెరపీ చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఇష్టమైన పాటల్ని ఇయర్ ఫోన్స్ పెట్టి….పెద్ద సౌండ్ తో వినిపిస్తున్నారు. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇంకా డాక్లర్లు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎలాంటి ఫలితాలు రాకపోవడంతో డాక్టర్లు నిరుత్సాహ పడుతున్నారు. అజిత్ జోగి వయసు 74 సంవత్సరాలు కావడంతో వైద్యానికి శరీరం సరిగ్గా సహకరించలేదు అన్న కథనాలు మీడియాలో వస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు అజిత్ జోగి త్వరంగా కోలుకోవాలని దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు.