Ravi Teja vs Chiru: సంక్రాంతి బరిలో రవితేజ, చిరంజీవి.. సక్సెస్ అయ్యేది ఎవరో?

Ravi Teja vs Chiru: టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇకపోతే మాస్ మహారాజా ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ పూర్తికాకముందే అప్పుడే మరొక సినిమాను ప్రకటించారు హీరో రవితేజ.

కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ర‌వితేజ కెరీర్‌ లో 76 చిత్రంగా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాను ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌ లో జ‌రిగింది. ఇదే విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఒక ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్ అబిమానుల‌తో పంచుకుంది. ఆ పోస్ట‌ర్‌ లో ఒక బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లో ర‌వితేజ కూర్చోని ఉన్నాడు. ఒక చేతిలో స్పానిష్ నేర్చుకునే బుక్, మ‌రో చేతిలో షాంపైన్ బాటిల్ తో కనిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించారు మూవీ మేకర్స్. ఇదే ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ ఉన్న విషయం తెలిసిందే. 157 పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సాహు గార‌పాటి, సుస్మిత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే చిత్ర‌బృందం వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బాక్సాఫీస్ వ‌ద్ద చిరంజీవి వ‌ర్సెస్ ర‌వితేజ మూవీ పోటీప‌డ‌నున్నాయి. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో చూడాలి మరి.