కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కు కుటుంబ సమేతంగా వెళ్ళిన ఐశ్వర్య.. ఫోటో వైరల్!

75వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ ను నేడు (మే 17) నుంచి 28వ తేదీ వరకు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రెటీలు ఈ వేదికపై సందడి చేయనున్నారు.ఇక మన దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ వేదికపై సందడి చేసే అవకాశం బుట్ట బొమ్మ పూజా హెగ్డే దక్కించుకున్నారు. ఇకపోతే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనడం కోసం ఐశ్వర్య రాయ్ కుటుంబసమేతంగా బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్టులో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య సందడి చేశారు.

ఈ క్రమంలోనే వీరి ఫోటోలను మీడియా తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రెటీలు కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో నేడు రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశాన్ని అందుకోగా మరికొందరు ఈ ఫిలిమ్ ఫెస్టివల్ లో సందడి చేయనున్నారు.

అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, తమన్నా వంటి సెలబ్రిటీలు రెడ్ కార్పెట్ పై నడవనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ వంటి నటీమణులు సందడి చేయనున్నారు. ఇకపోతే దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి పూజా హెగ్డే ఈ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఇక ఈ వేడుక ప్యారిస్ లో జరగడంతో ఇప్పటికే సెలబ్రిటీలు అందరూ ప్యారిస్ చేరుకున్నారు.అయితే నటుడు అక్షయ్ కుమార్ మరోసారి కరోనా బారిన పడటంతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉండగా మిగిలిన సెలబ్రిటీలు అందరూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు.