Home News ఐశ్వ‌ర్యరాయ్ నా త‌ల్లి అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కుర్రాడు

ఐశ్వ‌ర్యరాయ్ నా త‌ల్లి అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కుర్రాడు

సెల‌బ్రిటీల పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను నాశ‌నం చేసేందుకు కొంద‌రు కంక‌ణం క‌ట్టుకొని అదే ప‌నిలో ఉంటారు. వారి గురించి చెడు ప్ర‌చారాలు చేయ‌డం, లేదంటే క‌ట్టు క‌థ‌లు అల్లి వారి ఇమేజ్ డ్యామేజ్ చేయాల‌ని ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తుంటారు. ఒక్కోసారి అయితే ఆ స్టార్స్ పిల్ల‌లం మేము అని కూడా చెప్పుకొస్తుంటారు. ఆ మ‌ధ్య నేను చిరంజీవి కొడుకును అంటూ ఓ వ్య‌క్తి ఎంత‌గా హ‌ల్ చ‌ల్ చేశాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ ఐశ్వ‌ర్య‌రాయ్ త‌న‌యుడిని అంటూ ఓ కుర్రాడు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు.

Aish | Telugu Rajyam

న‌టిగా, మిస్ ఇండియాగా కోట్లాది అభిమానుల అభిమానం సొంతం చేసుకున్న అందాల న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసిన ఐశ్వ‌ర్య‌రాయ్.. అమితాబ్ బ‌చ్చ‌న్ కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ను వివాహం చేసుకొని శ్రీమ‌తిగా మారింది. వారికి ఆరాధ్య అనే చిన్నారి ఉంది. ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా గ‌డిపే ఐశ్వ‌ర్య‌రాయ్‌కు 32 ఏళ్ల వ్య‌క్తి షాక్ ఇచ్చాడు. తాను ఐశ్వ‌ర్య‌రాయ్ మొద‌టి కొడుకును అని, ఆరాధ్య కన్నా ముందు నేనే పుట్టానంటూ హ‌ల్ చ‌ల్ చేసాడు. ఈ వార్త బీటౌన్ లో హాట్ టాపిక్‌గా మారింది.

సంగీత్ కుమార్ అనే వ్యక్తి తాను ఐశ్వర్యరాయ్‌కి IVF విధానంలో పుట్టినట్లు చెబుతున్నాడు. ఐష్‌కు 15 సంవ‌త్సరాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు నేను జ‌న్మించాను. నా తండ్రి లండ‌న్ నుండి విశాఖ‌ప‌ట్నంకు తీసుకొచ్చిన‌ప్పుడు ఓ రెండేళ్ళు ఐశ్వ‌ర్య‌రాయ్ త‌ల్లితండ్రులు ఆల‌నాపాల‌న చూసుకున్నారు. నా బ‌ర్త్ స‌ర్టిఫికెట్స్ అన్నీ ఐష్ ఫ్యామిలీ చింపి ప‌డేశారు. ప్ర‌స్తుతం సంగీత్ కుమార్ అనే వ్యక్తి చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ కాగా, అత‌నిని నోటికొచ్చిన‌ట్టు తిడుతున్నారు. ఇలాంటి క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్ప‌డం మానేసి మంచిగా ప‌ని చేసుకోమ‌ని స‌ల‌హా ఇస్తున్నారు. 

- Advertisement -

Related Posts

దేవినేని అవినాష్‌కు పెద్ద బాధ్యతే అప్పజెప్పిన సీఎం జగన్… నిరూపించుకుంటే ఇక దశ మారినట్టే ?

ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరగబోతున్న తొలి ఎన్నికలు కావడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ...

సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ “భీష్మ” డైరెక్టర్ !

టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతూ పోతోందో అంతే వేగంగా సైబర్ నేరగాళ్ల అక్రమాలూ పెరిగిపోతున్నాయి. సామాన్యులనే కాకుండా, ఈ సైబర్ నేరగాళ్లు ప్రముఖుల్ని వదలడం లేదు. తాజాగా నితిన్‌, రష్మిక మందానా జంటగా...

‘దృశ్యం 2’ షూటింగ్ మొదలెట్టిన వెంకటేశ్ !

గతంలో వచ్చిన 'దృశ్యం' సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఓ హత్య విషయంలో హీరో ఇంటిల్లిపాదీ ఒకే మాటపై నిలబడడం.. పోలీసులు ఎంతగా విచారణ చేసినా నిజం కక్కకపోవడం.. అదంతా ఓ కొత్త...

Latest News