కాపు ఉద్యమం నేపథ్యంలో తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ తగలబడింది. అగ్నిపథ్ స్కీమ్‌పై నిరసనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం చోటు చేసుకుంది.. ఇక్కడ రైలు కాదు, రైళ్ళు తగలబడ్డాయ్. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు నడిచాయి.. ఇప్పుడు తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ రాజకీయాలు నడుస్తున్నాయి.! బోత్ ఆర్ సేమ్ అనుకోవచ్చా.?
సోషల్ మీడియా వేదికగా, ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాల గురించిన చర్చ జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్ నుంచే ఈ అగ్నిపథ్ స్కీమ్ అల్లర్లు మొదలయ్యాయి. అవి తెలంగాణ రాష్ట్రానికీ పాకాయి. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఈ సెగల్ని చూస్తున్నాం.
ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు చిత్ర విచిత్రంగా వుంటాయి. కొంత ప్రమాదకరంగానూ వుంటాయి. ఆయా అంశాల్ని రాజకీయంగా ఆయా పార్టీలకు కలిసొచ్చేలా చేయడం ఆయన వ్యూహాల్లో ప్రత్యేకం. కాపు ఉద్యమాన్ని వైసీపీకి అనుకూలంగా మార్చిన ఘనత ప్రశాంత్ కిషోర్‌దే.
తెలంగాణలో ఇప్పుడు అగ్నిపథ్ వివాదం తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయంగా అనుకూలమయ్యేట్టు చేయడంలోనూ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కీలకమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నేరుగా ఈ వివాదాలతో ప్రశాంత్ కిషోర్‌కి సంబంధం వుందని చెప్పగలమా.? అలా చెప్పాలంటే, అందుకు తగ్గ ఆధారాలు వుండాలి. కానీ, అనుమానాలకు ఆధారాలు అవసరం లేదు. ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు తెలంగాణలో మార్మోగిపోతోందంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే మరి.
ఎంత రాజకీయ వ్యూహకర్త అయితే మాత్రం.. ఇంతలా దిగజారాలా.?