విజయ్ దేవరకొండ సినిమాని నమ్మి మళ్ళీ మోసపోతున్నారా?

టాలీవుడ్ సినిమా దగ్గర భారీ క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఒకడు. మరి విజయ్ దేవరకొండ అయితే హీరోగా చేసిన లాస్ట్ చిత్రం “లైగర్” ఘోరమైన ప్లాప్ గా మారింది. అయితే ఈ సినిమాకి తాను పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం అద్భుతం.

అయితే విజయ్ ఈ సినిమా కానీ హిట్ అయ్యి ఉంటే తన బాక్సాఫీస్ రేంజ్ లో భారీ మార్పు వచ్చి ఉండేది. అయితే విజయ్ కి క్రేజ్ ఉంది కానీ అది లైగర్ లాంటి డిజాస్టర్ వచ్చాక కూడా అలాగే ఉంది అని ప్రచారం అవుతున్న కొన్ని వార్తలు వింటే డౌట్ వస్తుంది.

నెక్స్ట్ విజయ్ చేస్తున్న సినిమా “ఖుషి” ఏకంగా 90 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్టుగా ఇప్పుడు సినీ వర్గాల్లో ఊపందుకున్న వార్త. అయితే ఇది ఎంత వరకు నిజమో కానీ థియేట్రికల్ గా కూడా ఈ రేంజ్ బిజినెస్ ని జరిపితే మాత్రం మళ్ళీ విజయ్ సినిమాని నమ్మి మోసపోయినట్టే అని చెప్పొచ్చు.

పెద్ద స్టార్ హీరోలకే 90 కోట్ల షేర్ మార్కెట్ ఇప్పుడు గగనంగా మారింది. హిట్ అయితే పర్వాలేదు కానీ జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా కూడా సినిమాలు ఇప్పుడు గట్టెక్కట్లేదు. మరి విజయ్ సినిమాల ఓపెనింగ్స్ టైర్ 2 లో హైయెస్ట్ వస్తాయి కానీ టైర్ 1 హీరోస్ లో ఎక్కడా పోల్చడానికి లేదు.

మరి అలాంటప్పుడు థియేట్రికల్ బిజినెస్ కూడా లైగర్ లానే జరిగితే భారీ హిట్ టాక్ రావడంతో పాటుగా భారీ ఓపెనింగ్స్ కూడా విజయ్ కొట్టాలి. అప్పుడు గాని ఖుషి గట్టెక్కే ఛాన్స్ లేదు.