Pooja Hegde Becoming Item Girl : టాలీవుడ్లో మరోసారి ఐటమ్ గర్ల్ గా పూజా హెగ్డే.. ఏ సినిమా కోసం అంటే?

Pooja Hegde Becoming Item Girl : ఇప్పుడు ట్రెండ్ బాగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సినిమాల్లో అంటే ఐటమ్ సాంగ్స్ కి స్పెషల్ గా కొంతమంది ఐటమ్ భామలు కేవలం ఆ సాంగ్స్ కోసం మాత్రమే ఉండే వారు.
కానీ ఇప్పుడు అలా కాదు స్టార్ హీరోయిన్స్ ని ఐటమ్ భామలుగా దింపి చిత్ర బృందం మరింత హైప్ ని తెచ్చుకుంటున్నారు.
అలా ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర దాదాపు అందరు స్టార్ హీరోయిన్ లు కూడా ఒక్కొక్కరు ఐటమ్ సాంగ్ లో మెరిసిన వారే మరి వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు.
పారితోషకం సినిమాలో మంచి పేరు వస్తుంది అంటే చాలు స్టార్ హీరోయిన్ లు ఐటమ్ సాంగ్స్ కి ఓకే చెప్పేస్తున్నారు. అలానే గతంలో 2018లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా “రంగస్థలం” లో అదిరే ఐటమ్ సాంగ్ చెయ్యగా ఇప్పుడు మళ్లీ ఐటమ్ గర్ల్ గా మారబోతున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.
వారి మాట ప్రకారం అయితే పూజా హెగ్డే “ఎఫ్ 3” సినిమాలో సాంగ్ చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
అదే మీరు అనుకున్న సినిమానే వెంకటేశ్ మరియు వరుణ్ తేజ్ లు నటించిన సినిమా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో నే పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేస్తున్నట్టు వినికిడి.
అలాగే తన ఫస్ట్ ఐటమ్ సాంగ్ కి ఇప్పుడు కూడా సంగీతం దేవిశ్రీప్రసాద్ అందివ్వడమే ఇంకో ఆసక్తికరమైన అంశం. మరి ఈ సినిమాలో సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.