ఇన్సైడ్ టాక్ : పవన్ “వీరమల్లు” సినిమా బడ్జెట్ భారీగా పెంచేసారా..?

harihara veeramallu

Harihara Veeramallu : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రెజెంట్ దర్శకుడు క్రిష్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే “హరిహర వీరమల్లు”. పవన్ ఇప్పటి వరకు చెయ్యని ఒక వినూత్నమైన సబ్జెక్టు ఇది. అయితే ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కావడంతో సినిమాలో సెట్టింగ్లు చాలా గ్రాండ్ గానే ఉంటాయి అందుకే ముందే ఈ సినిమాని భారీ స్థాయి బడ్జెట్ లో ప్లాన్ చేశారు.

కానీ ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు మళ్ళీ భారీ స్థాయిలో పెరగాల్సి వచ్చిందట. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 150 కోట్లు ప్లాన్ చెయ్యగా ఇప్పుడు అదనంగా మరో 50 కోట్లు పెరిగి ఏకంగా 200 కోట్ల ప్రాజెక్ట్ గా ఇది నిలిచిందట.

దీనితో ఈ సినిమా పవన్ కెరీర్ లోనే ఒక కాస్ట్లీ ప్రాజెక్ట్ గా నిలిచింది అని చెప్పాలి. అయితే మన దగ్గర అంటే పర్వాలేదు కానీ మిగతా భాషల్లో మాత్రం ఈ సినిమా బాగా పెర్ఫామ్ చెయ్యడం అనేది పెద్ద టాస్క్. మరి దాన్ని పవన్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

ఇంకా ఈ సినిమాలో హాట్ అండ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నుంచి నపూర్ సనన్, నోరా ఫతేహి లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.