విశాఖ నడిబొడ్డున వెలసిన కేజీహెచ్ ఆసుపత్రి ఉత్తరాంద్ర సహా ఒరిస్సా రాష్ర్టాలకు ప్రధాన ఆసుపత్రిగా కొన్నేళ్లగా సేవలందిస్తుంది. అన్ని రకాల జబ్బులకు ఇక్కడ చికిత్స ఉంటుంది. పేద..మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద జబ్బు చేసిందంటే కేజీహెచ్ లోనే చికిత్స. నిత్యం రోగులతో రద్దీగా ఉండే ఆసుపత్రి. ఒకప్పుడు కేజీహెచ్ లో ట్రీట్ మెంట్ అంటే? భయపడే సన్నివేశముండేది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి అధికారంలోకి వచ్చాక అక్కడ పెద్ద ఎత్తున ప్రక్షాళన జరిగింది. మెరుగైన వైద్యం అందించాలని అక్కడ అన్ని రకాల వసతులు సమకూర్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మెరుగైన వైద్యం దొరుకుతుంది.
లేదంటే కేజీహెచ్ లో ట్రీట్ మెంటా? అంటే ఆకాశం వైపు చూసే సన్నివేశం ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు అక్కడి సేవలు మునిపటి కన్నా బాగానే అందుతున్నాయి. అయితే ఆ ఆసుపత్రిలో అడుగు పెట్టాలంటే రాజకీయ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అన్న మాట మాత్రం వాస్తవం. అక్కడకి ఏ రాజకీయ నాయకుడు రోగులని చూడటానికి రారు. ఎంత పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నా రాష్ర్టంలో ఏ ఆసుపత్రికైనా వాళ్తారు గానీ..కేజీ హెచ్ కి మాత్రం రారు. అక్కడికి వెళ్తే పదవి ఊడిపోతుందోనని భయంతోనే చాలా మంది అడుగు పెట్టరని అది నాయకులకు ఓ సెంటిమెంట్ అని అంటారు. అదీ ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న వారు అసలు అటువైపు చూసింది కూడా లేదుట.
అలాంటింది దివంగత ముఖ్యమంత్రి ఎన్. టీ రామారావు తర్వాత మళ్లీ కేజీహెచ్ లో కాలు పెట్టింది యంగ్ సీఎం జగన్ కావడం విశేషం అంటూ ఆ పార్టీ కొమ్మ, నిర్మాత పీవీపీ గుర్తు చేసారు. 1995లో ఎన్టీఆర్ తొలిసారి అక్కడ చికిత్స పొందుతున్న రోగులని పరామర్శించారు. ఆ వెంటనే ఆయన పదివిని పొగొట్టుకున్నారని విశాఖ వాసులంటారు. అప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కేజహెచ్ లో కాలు పెట్టలేదుట. గురువారం ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ కారణంగా అపస్మారక స్థితిలోకి చేరుకున్న వారిని పరామర్శించడానికి ముఖ్యంత్రి జగన్ వెళ్లడం ఆశ్యర్యం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత అంత ధైర్యంగా కేజీహెచ్ లో కాలు పెట్టింది యంగ్ సీఎం అంటూ పీవీపీ గుర్తు చేయడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేసారు. తమ నాయకుడికి సెంటిమెంట్ లు ఉండవని…పదవులపై ఏనాడు వ్యామోహం లేదని… ప్రజల ప్రాణాలు కన్నా ఏదీ ముఖ్యం కాదని సంతోషం వ్యక్తం చేసారు.