తెలంగాణ దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను ఉత్కంఠకు గురి చేశాయి. ఎవ్వరు ఊహించనటువంటి ఫలితాలను దుబ్బాకలో ప్రజలు అందించారు. తెలంగాణలో ఓటమి అంటూ ఎరగని టీఆర్ఎస్ ను బీజేపీ నాయకులు పథకం ప్రకారం ఓడించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన రావుకు కనీసం డిపాజిట్స్ కూడా దక్కలేదు. కానీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ యొక్క కంచుకోటలాంటి స్థానంలో, దుబ్బాకకు సిద్దిపేటలో పక్కన హరీష్ రావు, గజ్వెల్ లో కేసీఆర్ ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీని గెలిపించారు. ఈ బీజేపీ యొక్క గెలుపు గంటలు ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో భయం పుట్టిస్తున్నాయి.
దుబ్బాక ఫలితాలు జగన్ భయపెడుతున్నాయా!!
తెలంగాణలో టీఆర్ఎస్ ఎంత బలంగా ఉందొ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కూడా ప్రస్థుతానికి అంతే బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థి చంద్రబాబునాయుడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుక్కలు చుపించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది మూడు రాజధానుల నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇంకా అమరావతిలో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఇంకా దాదాపు ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలకు కోర్ట్ లు అడ్డు చెప్తున్నాయి. తెలంగాణలో ఎలాగైతే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత దుబ్బాక ఎన్నికల్లో భయటపడిందో అలాగే స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎక్కడ భయటపడుతుందోనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. అలాగే కరోనా రావడం వల్ల కూడా ప్రభుత్వం అభివృద్ధిపై సరిగ్గా ఏకాగ్రత పెట్టలేకపోయింది. అలాగే అనేక ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఖజానా కూడా దెబ్బతింది. ఇలాంటి నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి జగన్ భయపడుతున్నారు.
టీడీపీకి ధైర్యం వచ్చిందా!!
దుబ్బాక ఎన్నికల ఫలితాలు ఎలాగైతే జగన్ కు భయాన్ని పుట్టించాయో అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు గుండెల్లో సీఎం కుర్చీపై ఆశలను మళ్ళీ చిగురింపచేశాయి. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు దగ్గరకు తీసుకెళ్తే వాళ్లే ఫలితాలను ఇస్తారని దుబ్బాక ఎన్నికలు నిరూపించాయి. అలాగే ఇప్పుడు ఏపీలో దీన స్థితిలో ఉన్న టీడీపీ నాయకులు కృంగిపోకుండా ఉండటానికి తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ప్రజలకు అండగా ఉంటే విజయాన్ని ఇస్తారనే ధైర్యాన్ని టీడీపీ నాయకులకు ఇచ్చాయి.