ఎన్టీఆర్ తర్వాత ఈ స్టార్ తో వర్క్ చెయ్యాలి అంటున్న జాన్వీ.!

లేటెస్ట్ గా బాలీవుడ్ సహా సౌత్ లో కూడా మంచి హాట్ టాపిక్ గా నిలిచిన యంగ్ అండ్ హాట్ హీరోయిన్ పేరు జాన్వీ కపూర్. మరి బాలీవుడ్ లో తాను నటించిన లేటెస్ట్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడి సౌత్ ఎంట్రీ పై కూడా మంచి హింట్ ఇచ్చింది.

ఇక జాన్వీ అయితే అక్కడే కాకుండా చాలా సార్లు తాను అయితే మన టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోనే నటించాలని ఉందని తన కోరిక అయితే ఎన్నో మార్లు చెప్పింది. మరి లేటెస్ట్ గా అయితే జాన్వీ మరో స్టార్ తో కూడా సౌత్ నుంచి నటించాలని ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది.

మరి ఆ నటుడు ఎవరో కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అట. ఎన్టీఆర్ తర్వాత అయితే ఆమెకి విజయ్ సేతుపతితో నటించాలని ఉందని ఆమె తెలిపింది. వారితో నటించే అవకాశం అయితే ఆమె ఎదురు చూస్తున్నట్టు కూడా తెలిపింది. మరి ఈమెకి అయితే ఎప్పుడు అవకాశం వస్తుందో చూడాలి.

ప్రస్తుతం అయితే ఈమె పలు బాలీవుడ్ సినిమాల్లోనే చేస్తుండగా ఎన్టీఆర్ తో సినిమాపై అయితే అతి త్వరలోనే అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తుంది.