కేజీఎఫ్, రాధే శ్యామ్ ట్రెండ్ లో ‘RRR’ కూడా డేట్ ఫిక్స్.?

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఉన్న కొన్ని ప్రెస్టేజియస్ పాన్ ఇండియన్ సినిమాల్లో కన్నడ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2”, టాలీవుడ్ నుంచి “రాధే శ్యామ్” సినిమా సహా ఇంకో భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఉంది. అయితే వీటిలో కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ సినిమా దగ్గర ఓ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.

అన్ని భాషలకు కలిపి ఒకటే టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసి వదిలారు. దీనితో ఇది పెద్ద హిట్ కావడంతో తర్వాత మరిన్ని పాన్ ఇండియా సినిమాలు పుష్ప, లేటెస్ట్ గా రాధే శ్యామ్ లు కూడా సింగిల్ టీజర్స్ తోనే వచ్చాయి. కానీ రాధే శ్యామ్ చైనీస్, జపాన్ ఆడియెన్స్ కి కూడా కలిపి వచ్చింది.

అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు రాజమౌళి సినిమా టీజర్ కూడా ఇదే హిట్ ట్రెండ్ లో రాబోతున్నట్టు తెలుస్తుంది. అన్ని భాషలు కలిపి ఒకే టీజర్ లో ఇది రాబోతుందట. అంతే కాకుండా ఈ అక్టోబర్ 29 నే ఇది ఉండొచ్చని సినీ వర్గాల్లో గట్టి టాక్. ఇక ఈ భారీ టీజర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.