Vijay Devarakonda: కాలేజీ లైఫ్ తలుచుకుంటేనే భయం వేస్తుంది… విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!

Vijay Devarakonda: సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా కాలేజీ లైఫ్ అంటే చాలా మెమొరబుల్ డేస్ అని భావిస్తుంటారు కాలేజీ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ స్నేహితులతో సరదాగా గడుపుతూ ఉంటారు అందుకే కాలేజీ రోజులను తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరని చెప్పాలి కానీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం కాలేజీ రోజులు తలుచుకుంటే చాలా భయం వేస్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని అనురాగ్ యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పల్లా అనురాగ్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సినీ నటుడు విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కళాశాల లైఫ్‌లో చేసిన రిస్క్‌లు ఇప్పుడు తలుచుకుంటే భయమేస్తున్నాయి. వేగంగా వాహనాలు నడపడం ఇప్పుడు భయమేస్తోంది. అప్పుడు ఏమైనా జరిగి ఉంటే ఇప్పుడు హీరోగా మీ కళ్ల ముందే ఉండేవాడిని కాదు అంటూ ఈయన మాట్లాడారు.లైఫ్‌తో కూడుకున్న మరెన్నో రిస్కులు చేస్తాం. అవన్నీ బాగానే కనిపిస్తాయి మరో ఐదు సంవత్సరాలు పోతే కానీ, మనం చేసిన రిస్కులు తలుచుకుంటే భయం వేస్తుంది అని తెలిపారు.

జీవితంలో స్థిరపడతానికి చదువుతో పాటు జీవితానికి ఉన్నత స్థానాన్ని ఇచ్చే లక్ష్యాల కోసం రిస్క్ చేయాలి తప్ప.. ఇతర వాటి కోసం ఎలాంటి రిస్కులు చేసిన జీవితాలను కోల్పోతాం అంటూ విద్యార్థులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఇలా విద్యార్థులను ఉద్దేశించి ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే చివరిగా ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలోనే గౌతం తిన్ననూరి డైరెక్షన్లో చేస్తున్న సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.