ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ మధ్య జరుగుతున్న పోరాటంపైనే ముచ్చట్లు. న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు సీనియర్ సిట్టింగ్ జడ్జి ఎన్ వీ రమణపై సీఎం జగన్ అవినీతి ఆరోపణలు చేశారు.
అయితే.. దీనిపై సుప్రీంలో ఎన్నో పిటిషన్లు దాఖలు అయ్యాయి. కొన్ని సీఎం జగన్ కు మద్దతుగా రాగా.. మరికొన్ని కోర్టు ధిక్కరణ కింద దాఖలు అయ్యాయి.
సీఎం జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని.. న్యాయమూర్తుల తీర్పుపైనే ఆరోపణలు చేయడమేంటంటూ… అడ్వకేట్లు చాలా మంది నిరసన తెలిపారు.
సుప్రీంకోర్టు అడ్వకేట్ సునీల్ కుమార్ సింగ్… జస్టిస్ ఎన్వీ రమణ మీద అవినీతి ఆరోపణలు చేసినందుకు.. సీఎం జగన్ పై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే.. సునీల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ తప్ప.. మిగితా పిటిషన్లను అన్నింటినీ సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. సీఎం జగన్ పై సునీల్ వేసిన పిటిషన్ ను మాతమే కోర్టు స్వీకరించింది. దానిపై విచారణ త్వరలోనే జరగనుంది.