రాజకీయాలలో దొరకనంత సేపు దొర..దొరికిన తర్వాత దొంగ. అలా అవినీతి..అక్రమాలకు పాల్పడ్డవారు..హత్యానేరాల కింద జైళ్లలో శిక్ష అనుభవిస్తుంటారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి నేతలకు కొదవలేదు. ఎక్కడిక్కకడే ఉన్నారు. రకరకాల కుంభ కోణాలు..హత్యా రాజకీయాలు..హవాలా తో పట్టుబడ్డ నాయకులు జైళ్లలో మగ్గిన నేతలు చాలా మందే ఉన్నారు. రాజకీయ నాయకుల మాటలు కోటలు దాటం అంతే సహజం. సింపుల్ గా క్రిమినల్స్ అంతా జైళ్లలో ఉండాలి. నీతిమంతులంతా చట్ట సభల్లో ఉంటారని రాజకీయ నాయకుల ప్రసంగాల విమర్శల్లో భాగంగా తరుచూ వింటుంటూనే ఉంటాం.
తాజాగా పార్లమెంట్ లో కూర్చొని ప్రసంగాల ద్వారా నీతులు చెప్పే మన ఎంపీల్లో 24 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయని తేలింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే? లోక్ సభ కంటే పెద్దల సభ అయిన రాజ్యసభలోనే ఎక్కువ శాతం క్రిమినల్స్ ఉన్నారు. మేథావులు, ఉద్దండులకు కొలవైన సభలో క్రిమినల్స్ మింగుడు పడని విశయమే అయినప్పటికీ! దిగమింగక తప్పదు. 26 శాతం మంది క్రిమినల్స్ ఆ సభలోనే ఉన్నట్లు ఏడీఆర్ సర్వే చెబుతోంది.
ఎంపీల ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించగా ఆర్జేడీ ఎంపీలో 80 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి.ఆమ్ ఆద్మీ శివసేన ఎంపీల్లో 67 శాతం మందిలో కేసులున్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. ఇక వైసీపీ, ఎన్సీపీ, సీపీఎం ఎంపీల్లో 50 శాతం మందిపై కేసులున్నట్లు తేలింది. ఎంపీల్లో 16 శాతం మంది 8వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివిన వారున్నారు. 50 శాతం మంది డిగ్రీ చేశారు. 23 శాతం మంది పీజీ చేశారు. 10 శాతం మంది డాక్టరేట్ కూడా చేశారు.