బ్రేకింగ్ : రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా మల్లికార్జున ఖర్గే !

రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నాయకుడిగా పదవీ విరమణ చేయనున్న గులాంనబీ ఆజాద్ స్థానంలో కొత్త నేతగా మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నియమించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే గతంలో లోక్ సభ కాంగ్రెస్ పక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఈ మేర రాజ్యసభ ఛైర్మన్ కు కాంగ్రెస్ పార్టీ సమాచారం అందించింది.

2014 నుంచి మాత్రం రాజ్యసభలో గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పక్ష నేతగా కొనసాగుతూ వస్తున్నారు.2009 నుంచి ఆయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. 2014 లో కాంగ్రెస్ ఓడిపోవడంతో రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 15 తో ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ముగుస్తోంది. గులాంనబీ పదవీ విరమణ సందర్భంగా ప్రధాని మోదీ ఎమోషనల్ అయ్యారు.

గులామ్ నబీ ఆజాద్ గురించి మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటతడి పెట్టారు. “శ్రీ గులామ్ నబీ ఆజాద్… పార్లమెంట్‌లో ప్రత్యేకమైన వారు. ఆయన తన పార్టీ గురించి మాత్రమే ఆందోళన చెందేవారు కాదు… రాజ్యసభ సజావుగా జరగాలని కూడా ఆలోచించేవారు. భారతదేశ అభివృద్ధిని కాంక్షించేవారు” అని నరేంద్ర మోదీ రాజ్యసభలో ఆజాద్‌ని ఉద్ధేశించి ప్రసంగించారు.