మల్లెమాలవారికి నాకు ఎలాంటి గొడవలు లేవు… బెటర్మెంట్ కోసమే బయటకు వచ్చా: అదిరే అభి

ప్రస్తుతం ఇండస్ట్రీలో జబర్దస్త్ గురించి, జబర్దస్త్ యాజమాన్యం గురించి కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు గురించి చర్చ జరుగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ యాజమాన్యం వారు అక్కడ పని చేసే వారిని చాలా నీచంగా చూస్తారని, సరైన తిండి కూడా పెట్టకుండా అవసర సమయాలలో కూడా ఆదుకోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన ఆర్పీ ఇప్పుడు జబర్దస్త్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ విషయం గురించి పలువురు జబర్దస్త్ కమెడియన్లు స్పందిస్తున్నారు. ఇటీవల ఆది, రాంప్రసాద్, శేషు వంటి వారు ఈ విషయం పై మాట్లాడుతు ఆర్పీ చెప్పినవన్నీ అపద్ధాలు అంటూ వెల్లడించారు.

ఇక తాజాగా అదిరే అభి కూడా ఈ విషయం గురించి స్పందించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అదిరే అభి మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని విషయాలు వెల్లడించారు. అదిరే అభి బాహుబలి సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అంతే కాకుండా ప్రస్తుతం అభి ‘వైట్ పేపర్’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యల గురించి అభి మాట్లాడుతూ… జబర్దస్త్ యాజమాన్యం గురించి అక్కడ ఫుడ్ విషయం గురించి ఆర్పీ చెప్పినవన్నీ అబద్ధాలే అంటూ వెల్లడించాడు.

ఇక శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అభి శ్యాం ప్రసాద్ రెడ్డి ఎవరికైనా అవసరం ఉన్న సమయంలో సహాయం చేశాడు అని చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ లో కంటిన్యూ అవుతారు అన్న వాళ్ళకి శ్యాం ప్రసాద్ రెడ్డి ఆర్థికంగా కూడా సహాయం చేశాడని ఈ సందర్భంగా అభి వెల్లడించాడు. ఈ క్రమంలో అభి జబర్దస్త్ కి దూరం కావటానికి గల కారణం ఏంటి అని యాంకర్ అడగగా.. సాధారణంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఏదైనా ఒక సంస్థలో పనిచేసినప్పుడు బెటర్మెంట్ కోసం వేరొక సంస్థకు వెళ్తారు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. మల్లెమాల వారితో చాలా సామరస్యంగా మాట్లాడుకొని జబర్దస్త్ మానేశాను. అంతే కాని మా మద్య ఎలాంటి గొడవలు జరగలేదు అని అభి వెల్లడించాడు.