సింగర్ గా మారిన ఆది.. వైరల్ అవుతున్న వీడియో?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ కామెడీ షోస్ లో సందడి చేస్తున్న హైపర్ ఆది తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ కామెడీ షో లకు మూల స్తంభంల నిలబడిన ఆది బర్త్ డే సెలబ్రేషన్స్ ని మల్లెమాలవారు చాలా ఘనంగా నిర్వహించారు. ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఆది పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు మరికొంతమంది సీరియల్ ఆర్టిస్టులు కూడా సందడి చేశారు.

హైపర్ ఆది బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కామెడీ తో పాటు అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా సందడి చేశారు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లోఆది సింగర్ గా మారిపోయాడు. నూకరాజు తో కలిసి ఆది పాట పాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. శ్రీరామదాసు సినిమాలోనీ పాటని నూకరాజు తో కలిసి ఆది అద్భుతంగా పాడాడు. వారిద్దరి పర్ఫార్మెన్స్ కి అక్కడున్న వారందరూ మైమరిచిపోయారు.

ఇక ఈ షో లో జడ్జ్ గా వ్యవహరించిన ఇంద్రజ గారు అద్భుతంగా పాట పాడారు అంటూ ఆది ని పొగిడింది. అంతే కాకుండా ఆది పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కండక్టర్ ఝాన్సీ తో పాటు మరొక కొత్త డాన్సర్ కూడా అద్భుతంగా డాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. ఇలా మొత్తానికి ఆది పుట్టినరోజు వేడుకలను మల్లెమాల వారు చాలా ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Sridevi Drama Company Promo - Every Sunday @1:00 PM - 16th October 2022 - Hyper Aadi, Indraja,Jhansi