Bollywood: ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి మనందరికీ తెలిసిందే. పరిణీత అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. అంతేకాకుండా నటనకు గాను ప్రశంసలు సైతం అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ది డర్టీ పిక్చర్స్ సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువ అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది నటి విద్యాబాలన్.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్క సినిమా ఆగిపోవడం వల్ల తనని దాదాపుగా తొమ్మిది సినిమాలు నుంచి తీసేసినట్లు ఆమె తెలిపింది. ఈ సందర్భంగా విద్యాబాలన్ మాట్లాడుతూ.. మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌తో కలిసి చక్రం అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా గురించి వార్తలు దక్షిణాది నుంచి ఉత్తరాది సినీ పరిశ్రమలకు వ్యాపించాయి. దాంతో పలు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ చక్రం మధ్యలోనే ఆగిపోయింది.
దీంతో ఆ సినిమా ఆగిపోవడానికి నేనే కారణం అంటూ ప్రచారం జరిగింది. దాంతో ఇండస్ట్రీలో నన్ను ఐరన్ లెగ్ అని అన్నారు. ఆ తర్వాత వెంటనే నేను కమిట్ అయిన తొమ్మిది ప్రాజెక్టుల నుంచి నన్ను తొలగించేశారు. అయితే చక్రం సినిమా ఆగిపోవడానికి కారణం నేను కాదు. మోహన్ లాల్ కు ఆ సినిమా దర్శకుడితో చిన్నచిన్న అభిప్రాయ బేధాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అంతే తప్ప ఆ సినిమా ఆగిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది విద్యాబాలన్. కానీ ఆ ప్రభావం మాత్రం తన కెరియర్ పై పడిందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విద్యాబాలన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
