Rambha: హీరోయిన్ రంభ రీ ఎంట్రీకి సిద్దం

90వ దశకంలో హీరోయిన్ రంభ పేరు ఎక్కువగా మార్మోగిపోయింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లో రంభ తన ముద్ర వేశారు. నటిగా రంభ కెరీర్‌లో మరుపురాని క్లాసిక్ చిత్రాలెన్నో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా రంభ ఈ సినీ పరిశ్రమకు, నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం రంభ రీ ఎంట్రీకి సిద్దంగా ఉన్నారు.

రంభ గ్లామర్, నటన, ఆమె గ్రేస్ ఫుల్ స్టెప్పులకు అప్పటి ఆడియెన్స్ ఫిదా అయ్యేవారు. రంభ తన రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘నా ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ సినిమానే. ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు అయినా నేను సంసిద్దంగా ఉన్నాను. ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. కొత్త పాత్రలను ఎంచుకుని, మళ్లీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

ఇక అభిమానులు, ప్రేక్షకులు ఆమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రంభ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో.. ఎలాంటి చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.

అది జగన్ లెవెల్ || Kanumuri Ravi Chandra Reddy Great Words About Ys Jagan || Telugu Rajyam