కార్తీకదీపం సీరియల్ ఫేమ్ వంటలక్క ఆస్తుల విలువ అన్ని కోట్ల రూపాయలా?

బుల్లితెరపై సీరియళ్లలో నటించడం ద్వారా కార్తీకదీపం ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. వెండితెర హీరోయిన్లకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వంటలక్కకు కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తెలుగులో ప్రేమీ విశ్వనాథ్ ఒక్క సీరియల్ కూడా చేయకపోయినా ఆమెకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రేమీ విశ్వనాథ్ కు తెలుగు సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నాయి.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో సీరియళ్లు చేసిన ప్రేమీ విశ్వనాథ్ ఆస్తులను బాగానే కూడబెట్టారని సమాచారం అందుతోంది. ప్రేమీ విశ్వనాథ్ ఏ సీరియల్ చేసినా ఆ సీరియల్ మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటోందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కార్తీకదీపం సీరియల్ కోసం రోజుకు లక్ష రూపాయల చొప్పున ఈ నటి పారితోషికం తీసుకున్నారని సమాచారం అందుతోంది. ప్రేమీ విశ్వనాథ్ మొత్తం ఆస్తుల విలువ 36 కోట్ల రూపాయలు అని సమాచారం.

ప్రేమీ విశ్వనాథ్ సొంతూరు ఎర్నాకులం కాగా ఆమెకు అక్కడ డూప్లెక్స్ హౌస్ ఉందని ఈ హౌస్ విలువ 2 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. తాజాగా ప్రేమీ విశ్వనాథ్ కొత్త కారును కొనుగోలు చేయగా ఆ కారు విలువ కూడా ఎక్కువ మొత్తమేనని సమాచారం. ప్రేమీ విశ్వనాథ్ దగ్గర ఉన్న కార్లలో ఒక ఇండిగో కారు కూడా ఉంది. ప్రేమీ విశ్వనాథ్ కు సొంతంగా 10 ఎకరాల పొలం ఉందని సమాచారం అందుతోంది.

ప్రేమీ విశ్వనాథ్ భర్త పేరు వినీత్ భట్ కాగా వినీత్ పేరిట కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. ప్రేమీ విశ్వనాథ్ భర్త పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సీరియళ్ల ద్వారా సంపాదించిన మొత్తాన్ని ప్రేమీ విశ్వనాథ్ తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రేమీ విశ్వనాథ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.