Actress Kasturi Is A Rebel : కస్తూరి.. అలనాటి హీరోయిన్. మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్ దాకా ఎదిగింది. అందాల పోటీల్లో ఐశ్వర్యా రాయ్, సుస్మితాసేన్ వంటి ముద్దుగుమ్మలతో పోటీ పడింది. అనుకోకుండా సినిమాల్లో ఛాన్స్ రావడంతో హీరోయిన్‌గా పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది కస్తూరి.
‘గ్యాంగ్ వార్’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కస్తూరి, అప్పట్లో బాలయ్య, జగపతిబాబు తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. నాగార్జునతో కస్తూరి నటించిన ‘అన్నమయ్య’ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.
అయితే, వ్యక్తిత్వం పరంగా ఏ విషయాన్నయినా వున్నది వున్నట్లు మాట్లాడేస్తుంది.. ఎంతటి వారి ముందైనా తాను అనుకున్నది కుండ బద్దలుకొట్టేస్తుందనే రూమర్ వుంది కస్తూరిపై. సోషల్ ఇష్యూస్ కావచ్చు, తన పర్సనల్ ఇష్యూస్ కావచ్చు.. రెబల్ అండ్ డైనమిక్ నేచర్‌తో వుంటుంది.
ఆ నేచరే ఆమెను సినిమాల్లో పెద్దగా సక్సెస్ కానివ్వలేదనని కొందరు అంటుంటారు. రాజకీయాలకు సంబంధించిన విషయాలను సైతం చాలా ఓపెన్‌గా క్వశ్చన్ చేస్తుంటుంది కస్తూరి. ‘కనెక్ట్ విత్ కస్తూరి’ అంటూ ఓ యూ ట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తోంది. తనకు తప్పు అనిపిస్తే, ఆ విషయాన్నితన ఛానెల్ ద్వారా డైరెక్టుగా క్వశ్చన్ చేస్తుంటుంది.
ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగానే గడుపుతోంది కస్తూరి. అడపా దడపా సినిమాల్లో కనిపిస్తోంది. అలాగే, బుల్లితెరపై సీరియల్స్‌తోనూ సందడి చేస్తోంది. ‘గృహలక్ష్మి’ సీరియల్ ద్వారా ఈ మధ్య బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది కస్తూరి.