నాకింకా బిగ్ బాస్ 3 పారితోషకమే ఇవ్వలేదు.. ఆ నటి సంచలన వ్యాఖ్యలు

kasturi shankar not yet received bigg boss 3 remuneration?

ఏంటి.. బిగ్ బాస్ 3 పారితోషకం ఇంకా ఇవ్వలేదా? ఇంతకీ ఎవరా నటి.. అంటారా? మనం మాట్లాడుకునేది తెలుగు బిగ్ బాస్ గురించి కాదండోయ్. తమిళ్ బిగ్ బాస్ గురించి. తమిళంలో కూడా ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్నది బిగ్ బాస్. త్వరలోనే నాలుగో సీజన్ కు రెడీ అయింది. త్వరలో ప్రారంభం కూడా కానుంది.

kasturi shankar not yet received bigg boss 3 remuneration?
kasturi shankar not yet received bigg boss 3 remuneration?

ఈసమయంలో ఓ కంటెస్టెంట్… బిగ్ బాస్ పై ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ నిర్వాహకులు తనకు ఇంకా పారితోషకం ఇవ్వలేదంటూ ట్వీట్ చేసింది. దీంతో కోలీవుడ్ లో ఒక్కసారిగా ఈ ట్వీట్ చర్చకు దారి తీసింది.

kasturi shankar not yet received bigg boss 3 remuneration?
kasturi shankar not yet received bigg boss 3 remuneration?

ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా? కస్తూరి శంకర్. బిగ్ బాస్ సీజన్ 3లో తను కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది. గత సంవత్సరమే ఆ సీజన్ పూర్తయినా.. ఇప్పటి వరకు తనకు దానికి సంబంధించిన పారితోషకం ఇంకా అందలేదట.

kasturi shankar not yet received bigg boss 3 remuneration?
kasturi shankar not yet received bigg boss 3 remuneration?

నేను అనాథ పిల్లలకు సాయం చేయాలన్న ఉద్దేశంతో బిగ్ బాస్ సీజన్ 3లోకి వెళ్లా. గత సంవత్సరమే సీజన్ పూర్తయినా.. ఇప్పటి వరకు షో నిర్వాహకులు నాకు చెల్లించాల్సిన పారితోషకాన్ని ఇంతవరకు ఇవ్వలేదు. బిగ్ బాస్ నిర్వాహకులు తప్పుడు ప్రామిస్ లు చేస్తారని నేనెప్పుడూ ఊహించలేదు.. అని కస్తూరి ట్వీట్ చేశారు.