Narendra Modi: భారతదేశాన్ని అని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడం కోసం ఎంతో శ్రమిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే అలాంటి గొప్ప మంచి వ్యక్తి బయోపిక్ ను మా వందే టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు.
ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ క్రాంతి కుమార్.సీహెచ్. సమాజం కోసం ఎన్నో కోరికలు గల బాలుడి నుంచి దేశ ప్రధానిగా మోదీ ఎదిగిన క్రమాన్ని మా వందే సినిమాలో చూపించనున్నారు. కాగా ఈ రోజు మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వీర్ రెడ్డి.ఎం. మాట్లాడుతూ.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత కథా చిత్రం.. మా వందే మూవీను మా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
మోదీ గారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని సంఘటనలు, విశేషాలన్నీ ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నాము. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్న సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందే మా వందే చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ నిర్మిస్తున్నాము అని తెలిపారు వీర్ రెడ్డి. అయితే తాజాగా నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్బంగా అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన సినిమా కోసం వెయిటింగ్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది. ఏంటి అన్న వివరాలు త్వరలోనే తెలియనున్నాయి..
