Parvateesam: శ్రీకాకుళంలో అడుగుపెడితే చంపేస్తామని బెదిరించారు… నటుడు పార్వతీశం!

Parvateesam: తాను చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉన్నానని, లైఫ్‌లో తనకు ఏం కావాలో క్లారిటీ ఉందని నటుడు పార్వతీశం అన్నారు. చిన్నప్పుడు తనకు ఆ క్లారిటీ ఉండేది కాదని, అమ్మానాన్న చెప్పడం వల్ల లేదా ఇంకెవరో చెప్పారని చేసేవాన్నని ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు అలా లేదని, తాను ఇంట నుంచి వచ్చిననుంచి ఒక నిర్ణయం తీసుకున్నాని, తాను ఎవరి మాట విననని, తనకు ఏం అనిపిస్తే అదే చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఫెయిల్ అయినా ఫర్వాలేదు. కానీ దాని నుంచి నేర్చుకుంటానని ఆయన చెప్పారు. కానీ అది ఏం జరిగినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది తన మైండ్ నుంచి రావాలని ఆయన తెలిపారు. తనకు ఎవరూ లీడర్ లేరని, తనకు తానే లీడరని ఆయన అన్నారు. అదొక్కటే తాను ఫిక్సయ్యానని ఇప్పటివరకు ఆ మాట మీదే తాను వెళ్తున్నానని ఆయన చెప్పారు. ఏదైనా సినిమా ఆడలేదు. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించి వెళ్లిపోతానని ఆయన వివరించారు.

ఇకపోతే తనకు శ్రీకాకుళంలో ఎదురైన కోడిగుడ్ల అటాక్ సంఘటనను చూస్తే చాలా భయం వేసిందని పార్వతీశం అన్నారు. తాను చేసిన నూకరాజు అనే క్యారెక్టరే దానికి కారణమని ఆయన చెప్పారు. కేరింత సినిమాలో తాను చెప్పిన ఓ డైలాగ్‌ వల్ల శ్రీకాకుళం వెళితే తనను కొట్టేస్తారా ఏంటీ అని చిన్న భయం స్టార్ట్ అయిందని ఆయన నవ్వుతూ చెప్పారు. ఆ చిత్రంలో తాను చెప్పిన డైలాగ్‌ చూసి పీజీ చేసిన వాడికి గోల్ అంటే ఏంటో తెలీదా అని వారు అలా రియాక్ట్ అయ్యారని పార్వతీశం అన్నారు. ముందు చేశాం కానీ, ఆ తర్వాత తమకే అనిపించింది అని ఆయన చెప్పారు. లొకేషన్‌లో మాట్లాడుకున్నపుడు అదంతా కామెడీ వేలోనే వెళ్తుందని అనుకున్నాం కానీ, వాళ్లు దాన్ని సీరియస్‌గా తీసుకున్నారని ఆయన తెలిపారు.

ఆ సీన్ చూసిన తర్వాత శ్రీకాకుళం వెళ్లినపుడు తమపై గుడ్లు కూడా విసిరారని ఆయన చెప్పారు. ప్రెస్‌మీట్‌లో దిల్ రాజు గారు, తాను కూడా దాని గురించి మాట్లాడామని ఆయన అన్నారు. తనకు దానిపై చాలా మంది తిట్టుకుంటూ మెసేజ్‌లు కూడా పెట్టారని ఆయన చెప్పారు. ఈ సారి మా శ్రీకాకుళం రా చెప్తాం నీ సంగతి అని, చాలా మంది సీరియస్ అయ్యారని ఆయన అన్నారు. ఆ తర్వాత తనకే అనిపించింది తప్పు చేశానేమోనని, కానీ అది తన చేతుల్లో లేదు కదా అని పార్వతీశం తెలిపారు. ఆ తర్వాత రోజులు మారాయి అనే సినిమాకు వెళ్లినపుడు మళ్లీ ఎవరైనా కొడతారేమోనని భయం వేసి, సర్ ఎవర్నైనా పెట్టండి సర్ అని అడిగినట్టు ఆయన చెప్పారు. ఏం అనలేదు. కానీ తనకు సెక్యూరిటీ పెట్టారని పార్వతీశం వివరించారు. ఆ తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌లో కూడా తాను ఏమైనా తప్పు చేస్తే క్షమించండి అని అన్నట్టు ఆయన చెప్పారు.