టాలీవుడ్ స్టార్స్ తో తన్నులు తినాలని ఆశ పడుతున్న అఖండ విలన్…!

ఈ రోజుల్లో సార్ హీరోలకు ఎంతటి క్రేజ్ ఉందో విలన్లకు కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోలకు దీటుగా విలన్లు కూడా తమ క్యారెక్టర్ ఉండాలని ఆశపడుతున్నారు. కొంతమంది హీరోలు కూడ విలన్ లుగా మారుతున్నారు. ఇలా అఖండ సినిమాలో విలన్ గా నటించిన నితిన్ మెహతా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో నితిన్ మెహతా విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే నితిన్ మెహతా అనుకోకుండా ఇలా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. 21 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీకి తన సేవలు అందించిన నితిన్ మెహతా రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడిలా నటుడిగా రాణిస్తున్నాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ మెహతా.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయిన నితిన్ మెహతా సినిమా రంగం వైపు ఎలా వచ్చాడో వివరించాడు. రిటైర్డ్ అయిన తర్వాత గడ్డం పెంచి కొత్త లుక్ ట్రై చేసిన ఆయన అనుకోకుండా ఓ రోజు హైదరాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో ఓ ఫిలింమేకర్‌ కంటపడ్డాడు. ఆ తర్వాత ఢిల్లీలో మొదటిసారిగా మోడల్‌గా కనిపించాడు. అలా మోడల్ గా ఫేమస్ అవటంతో ఫ్యాషన్‌ వీక్స్‌లో పాల్గొనాలంటూ తనకి ఫోన్‌ వచ్చిందని, అలా మొదట యాడ్స్‌లో తర్వాత సినిమాల్లో నటించే అవకాశం‌ వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా నితిన్ మెహతా మాట్లాడుతూ అఖండ సినిమాలో బాలకృష్ణగారితో పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఆయనతో పని చేసినప్పుడు ఈ ఇండస్ట్రీకి నేను కొత్తవాడిని అన్న ఫీలింగ్ ఆయన నాకు రానీయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా విలన్ పాత్రల్లో నటించడం ద్వారా ఒక రకమైన కిక్ వస్తుంది. నేను సినిమాల లోకి రాకముందు తెలుగు సినిమాలు చూసేవాడిని. ఆఖండ సినిమా ద్వారా విలన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపై కూడా టాలీవుడ్ లో విలన్ పాత్రలు చేయాలని ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్‌పై తన్నులు తినాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నితిన్ మెహతా రావణాసుర, స్పై సినిమాలతో పాటు ఓ తమిళ సినిమాలో కూడా చేస్తున్నట్టు తెలియజేశాడు.