ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న నటుడు అమరదీప్ తేజస్విని.. ?

బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ దీప్ చౌదరి ఎన్నో తెలుగు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇలా బుల్లితెర సీరియల్స్,అలాగే ఇతర కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న అమర్ దీప్ ఈరోజు నిశ్చితార్థం జరుపుకున్నారు.అయితే ఈయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు ఈ ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు.

అమర్ దీప్ పెళ్లి చేసుకుంది మరెవరినో కాదు, బుల్లితెర నటి తేజస్విని గౌడ్ తో ఇతను నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈమె కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ వంటి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు. ఈమె కన్నడ నటి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల విశేషమైన తెలుగు ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన అమర్ దీప్, తేజస్విని వివాహం నేడు ఎంతో ఘనంగా జరిగింది.

ఇక వీరి నిశ్చితార్థానికి పలువురు టీవీ సీరియల్ ఆర్టిస్టులు అలాగే యూట్యూబర్స్, ఇతర నటీనటులు హాజరైనట్టు తెలుస్తుంది.ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇన్ని రోజులపాటు వీరిద్దరూ సీక్రెట్ గా ప్రేమ వ్యవహారం నడిపి ఇలా ఒక్కసారిగా నిశ్చితార్థం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏది ఏమైనా వీరి నిచ్చితార్థంతో అందరినీ ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేశారని చెప్పాలి.