సినీ రంగాల్లో ఉన్న స్టార్ హీరోలు చేసే సినిమాలు, వారు వేసుకునే బట్టలు.. ఇలా ప్రతీ దానిపై అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. వారు చేసే యాడ్స్ దగ్గర నుంచి చిత్రాల వరకు అన్నింటిపై ఓ కన్నేసి ఉంచుంతారు. వారి పిల్లలు, కెరియర్, పర్సన్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా నెట్టింట కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి.
అదేంటంటే.. కొంత మంది స్టార్ హీరోల కుమార్తెలు వారి తండ్రుల ఇమేజ్ లను నాశనం చేస్తున్నారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇదంతా అనేది నెటిజెన్లే. ఒకరు ఈ కామెంట్లు చేసినా వాటికి అనేక ఉదాహరణలు ఇస్తూ వైరల్ చేసేస్తున్నారు. వాళ్లు చేసే పిచ్చి పనుల వల్ల వారి తండ్రుల ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని.. అది అర్థం చేసుకొని వాళ్లు మానేస్తే బాగుటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఆయన కూతురు సుష్మిత కొణిదెల.. చిరంజీవి కోసం కాస్య్టూమ్స్ డిజైన్ చేయడం ప్రారంభించింది. అయితే ఆమె కోసం ప్రత్యేకంగా రూపొందించిన బట్టలు బాగాలేవంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఈమె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా మారి చిరు చిత్రాలకు పని చేయగా అవన్నీ డిజాస్టర్లుగా నిలిచినట్లు చెబుతున్నారు.
అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కొచ్చాడైయాన్ ఫ్లాప్ గా నిలిచిందని… ఈ సినిమాకు ఆయన చిన్న కూతురు దర్శకురాలిగా పని చేసిందని వివరిస్తున్నారు. అలాగే ఇప్పుడు రజినీ కాంత్ పెద్ద కుమార్తె లాల్ సలామ్ చిత్రం కోసం ఐశ్వర్యా రజినీకాంత్ డైరెక్టర్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె పని తనం అంతా ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే కనిపించిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టర్ పై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. లుక్ అస్సలే బాలేదంటూ ట్వీట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయంలో నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు చాలా బెటర్ అని తెలుస్తోంది. బాలయ్య హోస్ట్ గా మారి చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు ఆయన చిన్న కుమార్తె తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించిందట. బాలకృష్ణ లుక్, ఆయన స్టైల్, స్పాంటేనియస్ గా వేసే పంచ్ డైలాగ్స్ ఉన్న క్రియేటివ్ మైండ్ల్ లో ఈమె కూడా ఒకరు అవడం, ఈ షో సూపర్ డూపర్ హిట్టు అవడంతో ఈమెను పొగుడుతున్నారు.