Acharya : బిగ్ అప్డేట్ : “RRR”, “రాధే శ్యామ్” లిస్ట్ లో “ఆచార్య” కూడా చేరిపోయింది!

Acharya :  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన మరో లేటెస్ట్ చిత్రం “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది రిలీజ్ కి రెడీగా ఉన్న భారీ సినిమాల్లో ఇది ఒకటి.

అయితే ఈ చిత్రాల్లో రాజమౌళి తీసిన భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) అలాగే ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్” లి కీలకమైనవి కాగా ఈ ఏడాది ఆరంభం లోనే ఈ రెండు సినిమాలు వాయిదా పడిన సంగతి చూసాం.

మరి ఈ రెండు భారీ సినిమాల లిస్ట్ లో మెగాస్టార్ ఆచార్య కూడా చేరిపోయింది. ఈ సినిమా ని ఈ ఫిబ్రవరి 4న రిలీజ్ చెయ్యట్లేదు అన్నట్టు కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు మూలాన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

అలాగే ఈ చిత్రం తాలూకా కొత్త డేట్ ని మళ్ళీ మంచి సమయం చూసి అనౌన్స్ చేస్తామని తెలిపారు. ఆ లోపు అందరినీ సేఫ్ గా ఉండాలని సూచించారు. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.