లోకేశ్ ముద్రను చెరిపేసి టీపీడీని అచ్చెన్నాయుడు నడిపించగలడా!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అందరికి తెలుసు. 2019 ఎన్నికల్లో వచ్చిన ఓటమితో పార్టీలో ఉన్న నాయకుల్లో ఉత్సహం తగ్గిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు కూడా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. డీలా పడ్డ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సహం నింపడానికి పార్టీకి కొత్త నాయకుడిని నియమించడానికి చంద్రబాబు నాయుడు పతకం రచించారు. అయితే పార్టీ నాయకుడిగా నియమించబడుతున్న అచ్చెన్నాయుడుకి నారా లోకేశ్ నుండి ఇబ్బందులు రానున్నాయి.

tdp mla atchannaidu gets bail from ap high court
tdp mla atchannaidu gets bail from ap high court

లోకేశ్ నుండి వస్తున్న కష్టాలు ఏంటి ?

ఇప్పటి వరకు టీడీపీలో పెత్తనం మొత్తం నారా లోకేశ్ దే. ఆయన చెప్పినట్టే పార్టీలోని సీనియర్ నాయకులు కూడా నడుచుకుంటున్నారు. అయితే ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతున్న అచ్చెనాయుడికి ఇదే సమస్యగా మారనుంది. ఇప్పటి వరకు నాయకుల్లో నారా లోకేశ్ వేసిన ముద్రను చేరిపి తన ముద్ర వేయగలడా అని టీడీపీ నాయకులు కూడా చర్చించుకుంటున్నారు. అలాగే పార్టీ నాయకుడిగా కష్టపడి రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలుపు బాటల్లో నడిపించినా కూడా ఆ కష్టం యొక్క ఫలితం కూడా లోకేశ్ కే వెళ్తుంది. అలాకాకుండా పార్టీ ఓడిపోతే మాత్రం ఆ నిందను అచ్చెన్నాయుడు మాత్రమే మోయాల్సి వస్తుంది. ఈ కష్టాలన్నీ దాటుకుని అచ్చెన్నాయుడు పార్టీ పగ్గాలు అందుకుంటారో లేదో వేచి చూడాలి.

అచ్చెన్నాయుడు పార్టీని నడిపించగలడా!

రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న అచ్చెనాయుడికి టీడీపీ పార్టీ పగ్గాలు అప్పగించడాని పార్టీ సీనియర్ నేతలు కూడా అడ్డుచెప్పడం లేదు.అలాగే వైసీపీ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను తట్టుకొని పార్టీ తరుపున నిలబడిన అచ్చెన్నాయుడుకి పార్టీ పగ్గాలు ఇవ్వడం తప్పు లేదని కూడా టీడీపీ నాయకులు చెప్తున్నారు. అలాగే ఆయనకు ఉన్న రాజకీయ అనుభవంతో పార్టీని సులభంగా నడిపించగలరని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ నిర్ణయాల్లో అచ్చెన్నాయుడు యొక్క పాత్ర కూడా ఉందని, దాదాపు అన్ని నిర్ణయాలు అచ్చెన్నాయుడే తీసుకునే వాడని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.