బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడు ఆరుగురే సభ్యులు ఉన్నారు. ఎలాగైనా టైటిల్ కొట్టేయాలన్న కసితో వీళ్లందరూ రెట్టించిన ఉత్సాహంతో ఆడుతున్నారు. ఈ క్రమంలో ఎంటర్‌టైన్ చేస్తూ మిమ్మల్ని మీరు నిరూపించుకోమని బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులో అరియానా బెస్ట్ రూలర్‌గా నిలిచింది.మహారాణి కిరీటం ధరించిన అరియానా ఇంట్లోవాళ్లకు ఓ టాస్క్ ఇచ్చింది. మీకు నచ్చిన వస్తువు తీసుకొచ్చి, దానికి సంబంధించిన జ్ఞాపకాన్ని పంచుకుకోవాలని ఆదేశించింది. అలాగే దాన్ని ఇంట్లో నచ్చినవాళ్లకు ఇవ్వాలని చెప్పింది. దీంతో సోహైల్ తన గుర్తుగా అభిజిత్‌కు సస్పెండర్, హారికకు కత్తి, మోనాల్‌కు టీ షర్ట్, అరియానాకు పర్ఫ్యూమ్, అఖిల్‌కు జాకెట్‌ను ఇచ్చాడు.
అనంతరం మహారాణిగా బాధ్యతలు చేపట్టిన మోనాల్ తనలో మంచీచెడు ఏంటో చెప్పమని మంత్రి అఖిల్‌ను అడిగింది. ఒక మనిషి నిన్ను ద్వేషించినా కూడా ఇష్టపడటం మంచి లక్షణమైతే, సంతోషంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం చెడు లక్షణమని చెప్పాడు. అలాగే నాతో ఉన్నట్లుగా వేరే అబ్బాయితో ఉంటే నాకు నచ్చదని మనసులోని మాటను చెప్పాడు.అనంతరం మోనాల్ స్కిట్ చేయమని ఆదేశించింది. అందులో భాగంగా అభిజిత్ అమ్మాయిగా నటిస్తూ సోహైల్‌ను పార్టీకి ఒప్పించాల్సి ఉంటుంది. కానీ వీళ్ల మధ్యలో అరియానా, హారిక కూడా దూరడంతో స్కిట్టు ఆగమాగం అయింది. కాసేపు నవ్వించినప్పటికీ ఎటూ తేలకుండా లేకుండా మధ్యలోనే ఆగిపోయింది.
మొత్తానికి ఈ అధికారం టాస్కులో అరియానా బెస్ట్ రూలర్‌గా ఎంపికైంది. దీంతో కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన ఆమె కన్నీటిపర్యంతమైంది. ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాకు మీ ప్రేమ కావాలి. ఈ ఒక్క మెట్టు నన్ను ఎక్కించండి. నాకు ఓటేసి సాయం చేయండి అని అభ్యర్థించింది. మరోవైపు నిన్న హారిక రాజ్యంలో జరిగిన గొడవతో అఖిల్, సోహైల్‌కు సరిగా మాటల్లేవు. ఈ అన్నదమ్ములను కలిపేందుకు మోనాల్ తన వంతు ప్రయత్నించగా చివరికి వాళ్లు కలిసిపోయారు. ఇక అభిజిత్ హారికను ఎంత మిస్సవుతున్నాడో చెప్పకనే చెప్పాడు. తనతో టైమ్ స్పెండ్ చేయమని చెప్తూ ఓ లేఖను రాత్రి ఒంటిగంటకు హారిక బెడ్‌పై పెట్టాడు. అది చూసి ఆమె చలించిపోయింది.దూరమయిన వారందరు తిరిగి దగ్గరవటం ప్రేక్షకులకి సంతృప్తిని కలిగించింది .