బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమం ఫుల్ స్వింగ్‌లో ఉంది. మొదట్లో కాస్త బోరింగ్ అనిపించినా కూడా రాను రాను ప్రేక్షకులలో మరింత ఆసక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో ఇంటి సభ్యుల మధ్య జరుగుతున్న పోట్లాటలు, టాస్క్‌లు లేనప్పుడు నడుస్తున్న రొమాంటిక్ ముచ్చట్లు బుల్లితెర ప్రేక్షకులకి చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తున్నాయి. అయితే ఈ షోలో అన్ని టాస్క్‌లు అబ్బాయిలు ,అమ్మాయిలు సమానంగా చేయాల్సి ఉంటుంది. వారి ప్రతిభ ఆధారంగానే బిగ్ బాస్ కొన్ని సార్లు స్పెషల్ సర్‌ప్రైజెస్ ఇస్తుంటారు.
ప్రస్తుతం ఇంట్లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో అభిజీత్ ఒకరు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అభిజీత్ ఇప్పుడు బిగ్ బాస్ షోతో మరింత దగ్గరయ్యారు. టాస్క్ ల సమయంలో మెదడుతో ఎక్కువగా ఆలోచించి సక్సెస్‌లు సాధిస్తున్న అభిజీత్ ఫిజికల్ టాస్క్ అప్పుడు కాస్త డల్ అవుతారు. ఇది ఆయన అభిమానులని కూడా నిరూత్సాహ పరుస్తుంది. అయితే అభిజీత్ ఫిజికల్ టాస్క్‌లలో అంత యాక్టివ్‌గా లేకుండా ఉండడానికి కారణం ఆయన తల్లి మీడియా ఛానెల్ ద్వారా చెప్పుకొచ్చారు.
అభిజీత్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. అభికి మేజర్‌గా షోల్డర్ ఇంజ్యూరీ అయింది. ఈ కారణంగానే అతనుకు ఫిజికల్ టాస్క్‌లలో యాక్టివ్‌గా ఉండడం లేదని స్పష్టం చేసింది. అయితే అభి మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ పర్సన్. ఇంట్లోను చాలా కామ్‌గా ఉంటాడు. కాని ఏదైన సాధించాలనే తపన చాలా ఉంటుంది. బిగ్ బాస్ ట్రోఫీ తప్పక అందుకుంటాడనే నమ్మకం మాకుంది అని అభిజీత్ తల్లి చెప్పుకొచ్చారు. కాగా, అవినాష్ ఈ వారం నామినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సార్లు నామినేషన్ లోకి వచ్చిన అభీని ప్రేక్షకులు సేవ్ చేస్తూ వస్తున్నారు