Sohel : కొత్త కారు కొన్న సోహెల్.. జోరు మామూలుగా లేదు!

బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్, ప్రైజ్ మనీ విన్నర్ సోహెల్ ప్రస్తుతం చేస్తోన్న రచ్చఅందరికీ తెలిసిందే. కొత్త సినిమాలు, కొత్త ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్నాడు. సోషల్ మీడియాలో సోహెల్ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. అలా సోహెల్ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్‌లోనే ఉంటున్నాడు. మెహబూబ్ అఖిల్ మోనాల్ అరియానాలతో సోహెల్ బయట చేస్తోన్న సందడి అంతా ఇంతా కాదు.

ప్రతీ రోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ సోహెల్ తన ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అయితే తాజాగా సోహెల్ ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి. సోహెల్ ఓ కొత్త కారును కొన్నాడు. అయితే బిగ్ బాస్ రెమ్యూనరేషన్‌, చివర్లో వచ్చిన ప్రైజ్ మనీ ఇలా అన్నింటిని కలిపి ఈ కారు కొన్నాడా? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ ఇళ్లు కొంటానని సోహెల్ అన్నాడు. కానీ ఇలా సడెన్‌గా కారు మీద సోహెల్ మనసు పడిపోయినట్టుంది.

ఇన్నాళ్లకు నా కల నిజమైంది.. కారు కొన్నాను అంటూ సోహెల్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. కారు కొనేప్పుడు సోహెల్ తండ్రి, తమ్ముడు పక్కనే ఉన్నారు. కారు సొంతమైందన్న ఆనందం అందరి కళ్లల్లో కనిపిస్తూనే ఉంది. అయితే సోహెల్ తన కొత్త చిత్రానికి కూడా మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.